Wednesday, 20 September 2017

మూడవ రోజు బతుకమ్మ చీరల పంపిణి

 మూడవ  రోజు బతుకమ్మ చీరల పంపిణి

 కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 20;   రెబ్బెన మండల కేంద్రంలో మూడవ  రోజు బతుకమ్మ చీరల పంపిణి ని రెబ్బెన సర్పంచ్ పెసర వెంకటమ్మ, సింగల్ విండో చైర్మన్ మధునయ్య ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల కేంద్రంలోని 18 సంవత్సరాలు నిండిన అందరు ఆడపడుచులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ ఆసిఫాబాద్ వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ, , గ్రామపంచాయతీ సెక్రటరీ  మురళీధర్,  సిబ్బంది,, నాయకులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment