Monday, 25 September 2017

ఉద్యోగాల సాధన టిబిజికెఎస్ తోనే సాధ్యం

ఉద్యోగాల సాధన   టిబిజికెఎస్ తోనే  సాధ్యం 

  కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 25  సింగరేణి కంపెనీలో వారసత్వ ఉద్యోగాల సాధన టి ఆర్ ఎస్ అనుబంధ సంగం   టిబిజికెఎస్  తోనే సాధ్యమౌతుందని  టిబిజికెఎస్  ఉపాధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి ,ఎం ఎల్ సీ  పురాణం సతీష్, ఎం ఎల్ ఏకోవా లక్ష్మి లు అన్నారు. సోమవారం  బెల్లంపల్లి  ఏరియా    గోలేటి కైరిగుడా ఓపెనకాస్ట్ వద్ద గేట్ మీటింగ్ నిర్వహించారు.  సమావేశంకు హాజరై వారు  మాట్లాడుతూ ఉమ్మడి రాష్టం లో సింగరేణి వారసత్వ ఉద్యోగాలు చట్టబద్ధమైన హక్కులను పోగొట్టిందే ఏఐటీయూసీ నాయకులేనని  ఈ విషయం సింగరేణి కార్మికులందరికీ తెలుసని  అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్   సింగరేణి కార్మికులకు  వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరానకు ప్రత్యేక చెర్యలు చేపడుతున్నట్లు  పేర్కొన్నారు. ఆనాడు సింగరేణి లో వారసత్వ ఉద్యోగాలు పోగొట్టడానికి అన్ని  జాతీయ సంఘాలదే బాధ్యత అని అన్నారు.ఆనాడు గుర్తింపు  సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ గెలిచి కార్మికులకు చేసిందేమి లేదని విమర్శించారు. ఈ కార్యక్రమం లో  టిబిజికెఎస్ ఉపాధ్యక్షులు సదాశివ్, రాష్ట్ర కమిటీ సభ్యులు  శ్రీనివాస్,  నాయకులూ రాంబాబు, ప్రకాష్ రావు,రాజు,నారాయణ రెడ్డి, వెంకటేశ్వర్లు, అజమేరా బాపూరావు, కుందారపు శంకరమ్మ, కార్మికులు , తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment