Tuesday, 19 September 2017

పల్లెలు ప్రశాంతత కు పట్టు కొమ్మలు - జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్

పల్లెలు ప్రశాంతత కు పట్టు కొమ్మలు - జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ 

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి)  సెప్టెంబర్ 19 ;  పల్లెలు ప్రశాంతతకు నిలయం లు అని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ అన్నారు , మంగళవారం  నూతనముగా ఏర్పాటు చేసిన చింతలమానేపల్లి పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పి ఆకస్మికం గా తనిఖి చేశారు. పోలీస్ స్టేషన్ నిర్వహణ పని తీరును, నేర నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను , స్టేషన్ క్రైమ్ రికార్డు ల నిర్వహణ క్రమమును మరియు  సిబ్బంది పని తీరు ను జిల్లా ఎస్పి స్వయముగా పరిశీలించారు. స్టేషన్ సిబ్బంది  యొక్క వి.పి.ఓ విదులను గురించి అడిగి , గ్రామాలలో నెలకొని వున్నా సమస్యలను గురించి  విచారించారు,  సరిహద్దు ప్రాంతాలలో ఉన్నందున జాగరూకత తో వుండి ,  సరిహద్దు ప్రాంతాల సమాచారం ను సేకరించాలని మరియు అంతరరాష్ట్ర పోలిసుల తో స్నేహసంబందాలను కలిగి నేరస్తుల సమాచార మార్పిడి  చేసుకోవాలని అన్నారు , సరిహద్దు గ్రామాలలో నిరంతర గట్టి నిఘా ను ఉంచి రాత్రి వేళలో క్రమంతప్పకుండా పోస్ట్ ప్రొటెక్షన్ డ్రిల్ నిర్వహించాలని  జిల్లా ఎస్పి ఆదేశించారు, గ్రామాలలో ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తే ఉక్కుపాదం తో అణిచి వేస్తాం అని జిల్లా ఎస్పి హెచ్చరించారు. గ్రామాలలో ఎవరు అయిన అపరిచితులు వ్యక్తులు అనుమానస్పదంగా సంచరించిన పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పి కోరారు. ఈ తనిఖీ లో కాగజ్ నగర్ డిఎస్పి హబీబ్ ఖాన్ , చింతలమానేపల్లె ఎసై రాజ్ కుమార్, చింతలమానేపల్లి  పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు పీ.ఆర్.ఓ మనోహర్ లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment