Friday, 15 September 2017

రైతు సమితిలు కావు తెరాస సమితిలు ; విపక్ష నేతల ఆరోపణ

రైతు సమితిలు కావు తెరాస సమితిలు 

            విపక్ష నేతల ఆరోపణ 

   కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి)  సెప్టెంబర్ 15 ;  అధికార పక్షం రాజకీయ లబ్ది కోసమే రైతు సమితిలు ఏర్పాటు చేస్తుందని సీపీఐ నాయకులు ఆరోపించారు. గ్రామ సభల ద్వారానే రైతుల సమస్యలు  పరిష్కారం అవుతాయని, తెరాస  నాయకులను రైతు సమన్వయ సమితి సభ్యులుగా నియమించడం  వలన కావని అన్నారు. అధికార పార్టీ తమ స్వంత  ప్రయోజనాల కోసం రైతు   సమితిలు ఏర్పాటు చేసి రైతులను గందరగోళానికి గురిచేస్తూన్నారని అన్నారు. రైతు సమన్వయ కమిటీల నియామకం రాజ్యాంగబద్ధమైన పద్ధతులద్వారా జరగాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో ఏ  ఐ టి యూ సి  జిల్లా కార్యదర్శి బోగే ఉపెండెర్ , మండల   కార్యదర్శి రాయల నర్సయ్య ,,నాయకులూ హరినాయక్, రామడుగుల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment