Friday, 22 September 2017

నేర పరిశోదనలో నూతన సాంకేతికత తోనే మెరుగైన ఫలితాలు – జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్

నేర పరిశోదనలో నూతన సాంకేతికత తోనే  మెరుగైన  ఫలితాలు ; జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 22 :    నేర పరిశోదనలో నూతనమైన పద్దతులను జోడించినప్పుడే మెరుగైన  ఫలితాలు వస్తాయి అని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా లోని స్థానిక పోలీస్  హెడ్ క్వార్టర్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో వెరిఫై -24*7 ట్రయల్  రన్ జిల్లా ఎస్పి ప్రారంబించారు, ట్రయల్ రన్ లో బాగంగా జిల్లా లో వెరిఫై -24*7 యొక్క ఉపయోగాలను జిల్లా ఎస్పి సిబ్బందికి వివరించారు, వెరిఫై -24*7 ను సమర్దవంతం గా వాడుకొని నేర పరిశోదనలో మెరుగైన ఫలితాలు వచ్చేలా కృషి చేయాలనీ జిల్లా ఎస్పి కోరారు. వెరిఫై -24*7 ద్వారా దేశ ,రాష్ట్రము లోని నేరస్తులపైన వున్నా కేసు లకు సంబందించిన అన్ని వివరాలను, ఇతర ప్రదేశాలలో నేరాల నమోదు మరియు కేసు యొక్క పూర్వ పరాలను ఒకే ప్రదేశం లో చూడవచ్చు అని పాక్షిక వివరాలు లభించినప్పటికీ నిర్దారణకు వచ్చే వీలు ఉంటుందని  జిల్లా ఎస్పి  తెలిపారు . అనంతరం సి సి టి ఎన్ స్ లో నమోదు మరియు వేగవంతమైన, క్రియాశీల ప్రతిభ కనబరిచిన ఈస్గాం ఎస్సై సుధాకర్ ను మరియు పీ.సి బబ్బెర శేఖర్ ను జిల్లా ఎస్పి అభినందించి ప్రోత్సాహకం గా వెయ్యి రూపాయల చెక్కు  ను  పీ సి-3257 బబ్బెర శేఖర్ కు అందచేశారు మరియు ఇక పై కూడా ఇలాగే మరిన్ని ప్రోత్సాహకాలు అందుకోవాలని జిల్లా ఎస్పి ఆకాంక్షించారు. అన్నిపోలీస్ స్టేషన్ ల సిబ్బంది,అధికారులు కూడా పోటిపడి పని చేసి ప్రోత్సహకాలు అందుకోవాలని సూచించారు. ఈ సమావేశం లో కాగజ్ నగర్ డిఎస్పి హబీబ్ ఖాన్ ,సిసి దుర్గం శ్రీనివాస్, ఎస్బి సిఐ సుధాకర్, ఎస్బి ఎస్సై లు శివకుమార్ , శ్యాం సుందర్ జిల్లాలోని సిఐ లు,ఎసై లు , ఐటి కోర్  ఇంచార్జ్ శ్రీనివాస్, కిరణ్ కుమార్,మాణిక్ రావు  మరియు పీఆర్ఓ మనోహర్ లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment