Wednesday, 13 September 2017

రచయిత కంచె ఐలయ్య దిష్టిబొమ్మ దగ్ధం

 రచయిత కంచె ఐలయ్య దిష్టిబొమ్మ దగ్ధం 

    కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి)  సెప్టెంబర్ 13 ;  సామజిక స్మగ్లర్లు కోమటోళ్లు  అనే పుస్తకము ను రద్దు చేసి ఆ  పుస్తక  రచయిత కంచె ఐలయ్య ను  అరెస్ట్  చెయ్యాలని  రెబ్బెన మండల ఆర్యవైశులు  అందరు కలిసి రోడ్డు పైర్యాలీ  నిర్వహించి రచయిత దిష్టి బొమ్మను దహనం చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ఉప తహసీల్దార్ విష్ణుకు వినతి పత్రాన్ని అందచేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రొపెసర్ కంచె ఐలయ్య రచించిన సామజిక స్మగ్లర్లు క్రొమటోళ్లు పుస్తకము సమస్త వైశుల  మనోభావాలను దెబ్బతీసి సమాజంలో  కుల, వర్గ , మాత విద్వేషాలను రెచ్చగొట్టే విదంగా ఉంది. సామజిక స్పృహ ఉంది అనుకొనే కంచె ఐలయ్య  ఇలాంటి రచనలు రాయటం సిగ్గుచేటు అన్నారు. ఇలాంటి రచనలపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మైలారపు  సుధాకర్, తణుకు రామన్న, గుల్భము చక్రపాణి, జి ప్రకాష్, ఏ విశ్వేశర్, యాంసాని సతీష్ తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment