Thursday, 31 August 2017

పనిలో నిబద్ధతే మనకు గుర్తింపు; ఎస్పి సన్ ప్రీత్ సింగ్

పనిలో నిబద్ధతే మనకు గుర్తింపు; ఎస్పి సన్ ప్రీత్ సింగ్ 

 కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 31 ;   మన పని తీరు యే మనకు అమోఘమైన గుర్తింపునిస్తుందని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ అన్నారు, ప్రజా పోలీసులు గా పనిచేసినప్పుడే  చేసిన సేవల కు   గుర్తింపు లబిస్తుందని ఆయన తెలిపారు.గురువారం జిల్లా లోని స్థానిక జిల్లా ఎస్పి క్యాంపు కార్యాలయం  లొ  పదవి విరమణ చేస్తున్న   తిర్యాని పోలీస్ స్టేషన్   ఏ.ఎసై  జే.భోజన్న ను     జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్  శాలువ తో సత్కరించి పుష్ప గుచ్ఛము ను అందచేశారు,  వారి యొక్క 37 సంవత్సరాల సర్విస్ లో చేసిన సేవల గురుంచి అడిగి తెలుసుకున్నారు , వారి యొక్క శేషజీవితము సుఖ సంతోషాలతో మనుమలు,మనుమరాండ్ల తో  ఆనందం తో గడపాలని అబిలాశించారు  మరియు  వారికీ రావలిసిన బెనిఫిట్స్ ను తక్షణం అందిస్తామని ఈ సందర్బంగా  జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ కార్యక్రంలో ఎస్పిసీసీ దుర్గం శ్రినివాస్, ఎస్బి ఎసై లు శివకుమార్ ,ఎన్.ఐ.బి ఇంచార్జ్ శ్యాం సుందర్, డి.పీ.ఓ. ఉన్నత శ్రేణి సహాయకుడు కేదార సూర్యకాంత్, ఇంతియాజ్,క్యాంపు కార్యాలయ సిబ్బంది కిరణ్ కుమార్ ,కే.సుధాకర్ మరియు పి.ఆర్.ఓ మనోహర్ లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment