అవినీతి నిరోధక శాఖకు చిక్కిన రెబ్బెన తహసీల్దార్
- 2 లక్షలతో పట్టుబడ్డ వైనం
- భూమి మ్యుటేషన్ కోసం ఐదు లక్షల డిమాండ్
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 23: రెబ్బెన మండలానికి చెందిన తహసీల్దార్ రమేష్ గౌడ్ ఏ సి బి వలలో చిక్కారు. వివరాలవులకి వెళితే తహసీల్దార్ రమేష్ గౌడ్ ను ముందస్తు సమాచారం మేరకు శనివారం వలపన్ని అదుపులోకి తీసుకున్నట్లు అవినీతి నిరోధక శాఖ డి ఎస్ పి సుదర్శన్ తెలిపారు. డి ఎస్ పి సుదర్శన్ మాట్లాడుతూ రెబ్బెన మండలం దేవులగుడాకు చెందిన యలమంచిలి సునీల్ చౌదరి గతసంవత్సరం నారాయణ రావుకు చెందిన తొమ్మిదిన్నర ఎకరాల పొలాన్ని కొనుగోలుచేశారు. సదరు పొలమును పట్టా మార్పిడి చేయించడానికి తహసీల్దార్ కార్యాలయంలో ఫిబ్రవరి 2017లో ధరఖాస్తుచేసుకున్నారు. తదనంతరం తహసీల్దార్ దరఖాస్తును పరిశీలించి సుమారు ఐదు లక్షల రూపాయలను లంచంగా డిమాండ్ చేయటం జరిగిందని, తహసీల్దార్ తన మధ్యవర్తి ఐన చింతపురి శంకర్ ద్వారా బేరసారాలు సాగించి మూడులక్షల ఇరవై వేలకు బేరం కుదుర్చుకొన్నారు. ఈ విషయాన్నీ బాధితుడు సునీల్ చౌదరి ఆ ని శా అధికారులకు తెలుపగా వారు శనివారం వలపన్నిదేవులగుడలోని బాధిత రైతు ఇంట్లో మధ్యవర్తి ఐన శంకర్ డబ్బులు తీసుకుంటుండగా నిఘా వేసి ఉన్న ఏ సి బి అధికారులు డబ్బులతో శంకర్ ను ఆ ని శా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. . ఎం ఆర్ ఓ ఆఫీసులో విచారణ జరిపి రికార్డులను పరిశీలించి, తదుపరి తహశీల్ధార్ రమేష్ గౌడ్ ను , మధ్యవర్తి శంకర్ ను కరీంనగర్ కు పంపించారు . ఈ దాడిలో ఆ ని శా సర్కిల్ ఇనస్పెక్టర్లు కాశయ్య, వెంకటేశ్వర్లు, వీరభద్రం , వేణుగోపాల్ పాల్గొన్నారు. తహసీల్దార్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ తనను ఈ కేసులో అక్రమంగా బనాయించారని, తన మంచితనాన్ని భరించలేని కొంతమంది కుట్రపన్ని ఇరికించారని అన్నారు.
No comments:
Post a Comment