Tuesday, 19 September 2017

నూతన కళాశాల భవణంలో తరగతులు నిర్వహించాలి అఖిల భారత విద్యార్థి సమాఖ్య


 నూతన కళాశాల భవణంలో తరగతులు నిర్వహించాలి    అఖిల భారత విద్యార్థి సమాఖ్య
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి)  సెప్టెంబర్ 19 ;     రెబ్బెన మండలంలో నూతనముగా నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల భావనమునకు విద్యుత్తు ,మొదలగు కనీస సౌకర్యములుకల్పించి  తరగతులను నిర్వహించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో జూనియర్ కళాశాలస్ విద్యార్థినులు బతుకమ్మలతో ఆందోళమా చేపట్టారు. ఈ సందర్బంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆసిఫాబాద్  జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్, డివిజన్ కార్యదర్శి పూదరి సాయి కిరణ్  లు   మాట్లాడుతూ  అఖిల భారత విద్యార్థి సమాఖ్య పోరాటాల ఫలితంగా నిర్మించబడిన నూతన భవనం పాలకుల అశ్రద్ధ వలన రెండుసంవత్సరాలనుండి నిరుపయోగంగా ఉండదనే కాకుండా మందుబాబులకు, నిలయంగామారిందని  దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ దసరా సెలవులలోనైనా కనీస సౌకర్యాలను కల్పించి సెలవుల అనంతరం జూనియర్ కళాశాలను నూతన భవనం నిర్వహించాలని లేనిపక్షంలో  అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలోఆందోళనలను చేపడతామని హెచ్చరించారు . ఈ సందర్భంగా రెబ్బెన కేంద్రంలో రహదారిపై బతుకమ్మలతో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులూ రాజేష్,సిరికొండ సాయి, సంపత్ ,ప్రశాంత్, నవీన్, విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment