భూ సర్వే ద్వారా భూముల లెక్క పక్కాగా ఉంటుంది
రెబ్బెన తహసీల్దార్ బండారి రమేష్ గౌడ్
రెబ్బెన తహసీల్దార్ బండారి రమేష్ గౌడ్
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 15 ; భూ రికార్డుల ప్రక్షాళన, భూ సర్వే నిర్వహించడం వల్ల భూ వివాదాలు పరిష్కారం అవడమే కాకుండా భూముల లెక్క పక్కాగా ఉంటుందని తద్వారా గందరగోళ పరిస్థితులు తలెత్తవని రెబ్బెన మండల తహసీల్దార్ బండారి రమేష్ గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రికార్డు ల ప్రక్షాళన కార్యక్రమం శుక్రవారం రెబ్బెన మండలంలో ప్రారంభం ఐన సందర్బంగా మొదటి రోజు మండలంలోని ఎడవెల్లి, జక్కులపల్లి, రాజారం గ్రామాలల్లో రెవెన్యూ సిబ్బంది పర్యటించి ఇంటింటికి తిరుగుతూ భూమూలా లెక్కలు నమోదు చేసారు. దీని కోసం మండలంలో మూడు రెవెన్యూ టీమ్ లను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ రెవెన్యూ రికార్డుల్లో భూమిని అనుభవిస్తున్న పేరుకు,పట్టాదారు పేరుకు పొంతన ఉండడం లేదని, పట్టాదారు, అనుభవదారు మధ్య నెలకొన్న సమస్యలు ఈ సర్వే ద్వారా పరిష్కారం కానున్నాయని అన్నారు. రైతులు వారి వారి వివరాలను అధికారులకు అందజేశారు. ఆయా గ్రామాలల్లో జరిగిన సర్వే కార్యక్రమంలో రెబ్బెన ఎంపీపి సంజీవ్ కుమార్, యూప తహసీల్దార్ విష్ణు, వ్యవసాయాధికారిని మంజుల, పశు వైద్యాధికారి సాగర్, సీనియర్ అసిస్టెంట్ ఊర్మిళ, సర్పంచ్ లు సులోచన, భీమేష్, విఆర్వోలు ఉమ్లాల్, మల్లేష్, ధోని బాపు, వాసుదేవ్, విఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment