అమరజీవి కొమురయ్యకు ఘన నివాళి
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన సెప్టెంబర్ 05 : ; సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక నాయకుడు, సింగరేణి కార్మికుల గుండెల్లో చిరకాలం నిలిచిపోయిన ఏఐటీయూసీ దివంగత కార్మిక నేత మనుబోతుల కొమురయ్య 21వ వర్ధంతి సందర్బంగా మంగళవారం గోలేటిలోని కేఎల్ మహేంద్ర భవన్ లో ఏఐటీయూసీ నాయకులు ఘన నివాళ్లు అర్పించారు. ఈ సందర్బంగా ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి మాట్లాడుతూ సింగరేణి కార్మికుల హక్కుల కోసం అహర్నిశలు కృషి చేసి, వివిధ హక్కులను సాధించిన మహానేత కొమురయ్య అని ఆయన కొనియాడారు. సింగరేణిలో అణా పైసా జీతం నుండి వెయ్యిల రూపాయలు జీతం పెరగడం కోసం కొమురయ్య చేసిన పోరాటం ఫలించి సమాన పనికి సమాన జీతం హక్కును సాధించి పెట్టిన మహా ఉద్యమ నాయకుడు కొమురయ్య అని అన్నారు. దాన్ని ఇప్పటికి కార్మిక వర్గం మదిలో పదిలంగా పెట్టుకుందని తిరుపతి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి బి.జగ్గయ్య,ఏఐటీయూసీ, సీపీఐ నాయకులు బోగే ఉపేందర్, రాయిళ్ల నర్సయ్య, అంబేడ్కర్, సంపత్, ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి పూదరి సాయికిరణ్, నాయకులు పడాల సంపత్, రాజేష్, కిరణ్, శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment