Saturday, 16 September 2017

ప్రపంచ వెదురు దినోత్సవ వేడుకలు

 ప్రపంచ వెదురు దినోత్సవ వేడుకలు

    కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి)  సెప్టెంబర్ 16 ; సెప్టెంబర్ 18  న ప్రపంచ వెదురు దినోత్సవాన్ని , పురస్కరించుకొని కొమురంభీం జిల్లా యువజన సంఘం నాయకులు రెబ్బెన మండలం కేంద్రంలోని విశ్వశాంతి విద్యాలయం హైస్కూల్లో , వెదురు మొక్కను గురించి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పోటీలో గెలిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల  ప్రధానోపాధ్యాయులు   పోచయ్య , జిల్లా ప్రధాన కార్యదర్శి రాపాల శ్రీనివాస్, జిల్లా వెదురు పారిశ్రామిక సంఘం అధ్యక్షులు గట్టు రాజకనకయ్య మరియు జిల్లా యువజన సంఘం అధ్యక్షులు గట్టు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment