Friday, 8 September 2017

సింగరేణి గుర్తింపు ఎన్నికలలో ఏ ఐ టి యూ సి ని గెలిపించండి

సింగరేణి  గుర్తింపు ఎన్నికలలో ఏ ఐ టి యూ సి ని గెలిపించండి  

  కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  సెప్టెంబర్ 08 ;   బెల్లంపల్లి ఏరియా లోని సింగరేణి వర్కర్స్ సింగరేణి  గుర్తింపు ఎన్నికలలో ఏ ఐ టి యూ సి   ని గెలిపించలని   ఏ  ఐ టి యూ సి ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ వి సీతారామయ్య అన్నారు బెల్లంపల్లిఏరియా ఖైర్ గూడా  గనిపై ఏర్పాటుచేసిన గేట్ మీటింగ్ లో మాట్లాడిన  అనంతరం . రెబ్బెన మండలం గోలేటి  మహేంద్రభవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ    అక్టోబర్ ఐదవ తేదీన జరిగే గుర్తింపు సంఘం ఎన్నికలలో  ఏ  ఐ టి యూ సి  ని గెలిపించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను అడ్డుకునేందుకే దేశవ్యాప్తంగా ఏ  ఐ టి యూ సి ,ఐ ఎన్  టి యూ సి జతకలిశాయని తెలిపారు. సుప్రీమ్ కోర్ట్ వారసత్వ ఉద్యోగాలపై  ఇచిన తీర్పుని అడ్డంపెట్టుకొని చనిపోయిన ,మెడికల్ ఆన్  ఫిట్ ఐనా కార్మికులపిల్లలకు కూడా వారసత్వ ఉద్యోగాలు ఇచ్చేది  లేదు  అని వేజ్ బోర్డు లో మెలిక పెట్టారని తెలిపారు. సెప్టెంబర్ 18,19 తేదీలలోజరిగే చర్చలు విఫలమైనట్లయితే దేశవ్యాప్తబొగ్గుగని కార్మికులు ఆందోళనలకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. కార్మిక వర్గం ఏఐటీయూసీని ఆదరించి నక్షత్రం (చుక్క) గుర్తుకు ఓటు వేసి బారీ  మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు చేసారు. ఏఐటీయూసీ గుర్తింపు   సంఘంగా గెలవగానే వారసత్వ ఉద్యోగ హాక్కును సాధిస్తామని, కార్మికుల స్వంతింటి కళను  నెరవేరుస్తామని అన్నారు. కార్మిక వర్గాన్ని మోసం చేసిన టీబీజీకేఎస్ ను చిత్తు చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పాలని అయన అన్నారు.ఈ సమావేశంలో ఏ  ఐ టి యూ సి జిల్లా కార్యదర్శి అంబాలా ఓదెలు , బెల్లంపల్లి ఏరియా ఇంచార్జి   కా  చిప్ప నర్సయ్య ,  బ్రాంచ్ సెక్రటరీ ఎస్ తిరుపతి,  ఐ ఎం టి  యూ సి నుంచి బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్  మాచెర్ల మల్లయ్య,  సెక్రటరీ  ,మరియు    కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment