అంగన్వాడిల సమస్యలపై తహసీల్దార్ కు వినతిపత్రం
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన సెప్టెంబర్ 07 ; తెలంగాణ ఆఅంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్సి ఐ టి యూ రెబ్బెన మండల కమిటీ త మసమస్యలపై సి ఐ టి యూ జిల్లా అధ్యక్షులు అల్లూరి లోకేష్ ఆధ్వర్యంలో రెబ్బెన తహసీల్దార్ కు వినతిపత్రం అందచేశారు. వినతిపత్రంలో అంగం వాడి ఉద్యోగులు గత నలభై సంవసరాలుగా చాలీచాలని జీతాలతో,దుర్భర జీవితంగ్గడుపుతూ, సమాజానికి తమవంతు సేవచేసారని, వారి సేవలను గుర్తించకుండా ఇప్పుడు ప్రభుత్వం కేవలం అరవైవేలు, ముఫైవేలు వన్ టైం సెటిల్మెంట్ కింద ఇచ్చి ఇన్నేళ్ళుగా సేవలందించిన అంగం వాడి వర్కర్లను ఇంటికి సాగనంపాలనుకుంటున్నారని ,గ్రేటుఇటై చట్టం ప్రకారం ప్రతి సర్వీస్ సంవత్సరానికి పదిహేను రోజుల వేతనాన్ని లెక్కకట్టి ఒక్కొక్కరికి మూడు నుంచి నాలుగు లక్షలరూపాయలు వస్తాయని, పెన్షన్ కూడా చివరి నెల జీతంలో సగం ఉండాలని డిమాండ్ చేసారు. పనిభారం పెంచడానికి రేషన్ దుకాణాలద్వారా అంగం వాడి లు సప్లై నిర్యాణాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన మండల కమిటీ సభ్యులు చంద్రకళ, ప్రమీల, సంధ్య, బాలమ్మ, భారతి, సుశీల, రాజేశ్వరి, మంజుల, శోభారాణి, అమృత, నిర్మల, స్వర్ణలత, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment