తెరాస అభివృద్ధి ఓర్వలేక కాంగ్రేస్ నాయకులూ ఆరోపణలు మానుకోవాలి. పోటు శ్రీధర్ రెడ్డి
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన సెప్టెంబర్ 06: తెరాస చేస్తున్న అభివృద్ధి పనులు ఓర్వలేక కాంగ్రేస్ పార్టీ నాయకులూ తప్పుడు ఆరోపణలు చేయటం తగదని తెరాస పార్టీ మండల అధ్యక్షులు పోటు శ్రీధర్ రెడ్డి అన్నారు. బుధవారం రెబ్బెన అతిధి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి రాబోయే రోజుల్లో పుట్ట గతులు ఉండవని, తెరాస ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు చెయ్యడం సరికాదని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న రైతు సమన్వయ కమిటీ లలో గ్రామాల్లో రైతులు స్వచ్చందంగా పాల్గొంటున్నారని అన్నారు. రైతులకు ఖరీఫ్, రబీ ఎకరానికి ఎనిమిది వేల చొప్పున పెట్టుబడి పథకాన్ని అమలు చేస్తున్నారు.. ప్రభుత్వం పై చౌకబర విమర్శలు,అసత్యపు ఆరోపణలను మానుకోవాలని లేని పక్షం లో రాబోయే రోజాల్లో ప్రజలు,రైతులే బుద్ది చెప్తారని అన్నారు. గతంలో కాంగ్రేస్ పార్టీ చేసింది ఏమి లేదు అని రాబోయే రోజుల్లో పార్టీ ఉనికి కోసమే ప్రజల్లో చౌకబార మాటలు చెప్తున్నారు అన్నారు.ఈ సమావేశంలో గంగాపూర్ ప్రధాన కార్యదర్శి పందిర్ల మాదానయ్య, రైతులు లెండుగురే జైయరం,వాడై అరుణ్ కుమార్, ఆర్ రాజమౌళి,ఏన్ విలాస్ తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment