ఏ ఐ టి యూ సి ని భారీ మెజారిటీ తో గెలిపించండి : ఎస్ తిరుపతి
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన సెప్టెంబర్ 11 ; ఏ ఐ టి యూ సి ని భారీ మెజారిటీ తో గెలిపించలని గోలేటి ఏ ఐ టి యూ సి బ్రాంచ్ కార్యదర్శి ఎస్. తిరుపతి అన్నారు, సోమవారం రెబ్బెనలోని కైర్ గూడా ఓపెన్ కాస్ట్ గనిపై జరిగిన కార్మికుల సమావేశంలో అయన మాట్లాడారు. ప్రస్తుతమున్నటి బి జి కే ఎస్ సంఘం ప్రతినిధుల అనాలోచిత నిర్ణయాలవలన సంస్థ మనుగడ ప్రశ్నర్ధకంగా మారిందని రాబోయే భవిష్యత్తులో ఇంకా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని, కార్మికుల హక్కుల సాధన కేవలం ఏ ఐ టి యూ సి తోనే సాధ్యమని,జరగబోయే గుర్తింపు సంఘ ఎన్నికలలో ఏ ఐ టి యూ సి ని భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో జగ్గయ్య,చంద్ర శేఖర్, వెంకటి, రెహ్మాన్, సత్యనారాయణ, కిరణ్ బాబుతదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment