సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీనే గెలిపించండి
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన సెప్టెంబర్ 05 : సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ నే గెలిపించాలని ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి, ఐఎన్టీయూసీ ఏరియా ఉపాధ్యక్షుడు ముచ్చెర్ల మల్లయ్యలు కార్మికులను కోరారు. మంగళవారం బెల్లంపల్లి ఏరియా డోర్లి ఉపరితల గనిలో కార్మికులను కలిసి వారితో మాట్లాడారు.ఈ సందర్బంగా ఏఐటీయూసీ నాయకుడు ఎస్.తిరుపతి మాట్లాడుతు సింగరేణిలో ఏఐటీయూసీని ఆదరించి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కార్మికులను ఆయన కోరారు.ఏఐటీయూసీ గెలుస్తేనే అనేక హక్కులను సాధించుకోవచ్చని అన్నారు. ప్రభుత్వాలకు తొత్తులుగా వ్యవహరించే ప్రాంతీయ సంఘాలకు బుద్ధి చెప్పాలని అన్నారు.ఇంటాక్ నాయకుడు మల్లయ్య మాట్లాడుతు తమ పూర్తి మద్దతు ఏఐటీయూసీకేనని స్పష్టం చేసారు.ఈ సమావేశంలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నాయకులు చుంచు రాజన్న,ఓసిపిల ఇంచార్జి ఎం.లక్ష్మి నారాయణ,శ్రీనివాస్,నరసింహ్మ రావు తదితలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment