Thursday, 21 September 2017

సమాజం లో గురుతర బాద్యత పోలీసులదే - జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్

సమాజం లో గురుతర బాద్యత పోలీసులదే  - జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ 

  కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 21 :     సమాజం లో గురుతర బాద్యత పోలిసుల పైన ఉంటుందని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్  తెలిపారు. గురువారం స్థానిక  పోలీస్ హెడ్ క్వార్టర్ లొ జిల్లా ఎస్పి అద్యక్షతన  నెల వారి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.నేర సమీక్షా సమావేశం లో  జిల్లా ఎస్పి మాట్లాడుతూ అప్రమత్తత, సత్వర స్పందన వల్లనే నేరాలు అదుపులో ఉంటాయని  పేర్కొన్నారు, నేరం జరిగేందుకు అవకాశం వున్న ఏ ఒక్క అంశంను కూడా నిర్లక్ష్యం చేయకూడదు అని జిల్లా ఎస్పిఅధికారులను ఆదేశించారు , ఒకే M.O(మోడస్ ఒపరెండి) కలిగిన నేరస్తుల కదలికల పట్ల నిఘా ఉంచాలని , రోడ్ల పక్కన నిలిపివుంచిన వాహనాల లో దొంగతనం చేసేందుకు అనువుగా వుండే ప్రదేశాలలో గట్టి నిఘా ఉంచాలని ,అవసరం అయితే ఆయా ప్రదేశాలలో సిసి కెమెరా లను ఏర్పాటు చేసి , వాహనదారులకు దొంగతనాల పట్ల అవగాహన కలిపించాలని జిల్లా ఎస్పి సూచించారు. స్టేషన్ వారిగా నేరాల వివరాలను పరిశీలించిన  జిల్లా ఎస్పి వాటి పురోగతి ను పరిశీలించారు, కేసు లు సత్వరం పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు, రానున్న రోజులలో వచ్చే సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికలకు ,మొహర్రం , దుర్గ నవరాత్రులకు మరియు బతుకమ్మఉత్సవాలకు పటిష్టమైన బందోబస్తు నిర్వహించి  విజయవంతం అయ్యేలా అందరు కలిసి పని చేయాలని జిల్లా ఎస్పి సూచించారు. జిల్లా లో  వరకట్నం వేదింపులు 498(A)  కేసు లు ఎక్కువగా అవుతున్నందున ఒక ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటి జిల్లా జడ్జ్ అద్యక్షతన , కొంతమంది సభ్యులతో ఒక కమిటి ను ఏర్పాటు అవుతుందని  జిల్లా ఎస్పి తెలిపారు. ఈ సమావేశం లో కాగజ్ నగర్ డిఎస్పి హబీబ్ ఖాన్ , సిసి దుర్గం శ్రీనివాస్, ఎస్బి సిఐ సుధాకర్, జిల్లాలోని సిఐ లు, ఎసై లు , ఐటి కోర్  ఇంచార్జ్ శ్రీనివాస్, కిరణ్ కుమార్  మరియు పీఆర్ఓ మనోహర్ లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment