Friday, 8 September 2017

డిఈవొ ను సస్పెండ్ చేయాలి

డిఈవొ ను సస్పెండ్ చేయాలి

   కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  సెప్టెంబర్ 08 ;   కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయ పాఠశాలల్లో ఇష్టానుసారంగా బదిలీలు చేపడుతు పాఠశాలల్లో గందరగోళ పరిస్థితి సృష్టిస్తు, సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న జిల్లా విద్యాధికారిని  వెంటనే సస్పెండ్ చేయాలని  ఏ  ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్,  పి  డి ఎస్ యూ  జిల్లా ఇంచార్జ్ పాపారావు, ఆదివాసి విద్యార్థి సంఘం నాయకులు గణపతి, వేంకటేష్ డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల ఆద్వర్యంలో సిర్పూర్(U) మండల కేంద్రంలో డిఈవొ నిర్లక్ష్యన్ని నిరసిస్తూ డిఈవొ దిష్టి బొమ్మను దహనం చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ గత రెండు నెలల నుండి సిర్పూర్ యు కెజిబివి పాఠశాలలో ఆందోళనలు జరుగుతున్న సమస్యలు పరిష్కరించడంలో డిఈవొ నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. గత రెండు నెలల నుండి సిర్పూర్ యు కెజిబివి పాఠశాలలో తరగతులు జరగక విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాల్సిన అధికారులే అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని లేని పక్షంలో విద్యార్థి సంఘాల ఆద్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని దీనికి పూర్తి భద్యత అధికారులే వహించాలని హెచ్చరించారు.     

No comments:

Post a Comment