క్రమ శిక్షణ తో చదవాలి - సర్పంచ్ వెంకటమ్మ
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన సెప్టెంబర్ 05 ; విద్యార్థులు క్రమశిక్షణ తో చదవాలని , ఉన్నత శిఖరాలను అధిరోహించ వచ్చ్చని రెబ్బెన గ్రామ సర్పంచ్ పెసర వెంకటమ్మ అన్నారు . రెబ్బెన లోని సాయి విద్యాలయం (ఎస్ వి )ఇంగ్లిష్ మీడియం హై స్కూల్ లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు . విద్యార్థులు చదువు చెప్పే గురువులను , పెద్దలను గౌరవించాలనిచదువులో రాణించాలని పేర్కొన్నారు . సాయి విద్యాలయం యాజమాన్యం విద్యార్థులను అన్ని రంగాలలో మండలములో ముందంజలో ఉంచుతున్నందులకు ప్రత్యాక అభినందనలు తెలిపారు . అనంతరము ఉపాధ్యాయులుగా రాణించిన విద్యార్థులకు సర్పంచ్ వెంకటమ్మ, రిటైర్డ్ హెడ్మాస్టర్ చంద్రయ్యలు బహుమతులను అందజేశారు . ఈ కార్య క్రమములో రిటైర్డ్ ప్రధానోపాద్యాయులు మూలస్తం చెంద్రయ్య , పాఠశాల ప్రధానోపాధ్యాయులు దీకొండ సంజీవ్ కుమార్ , కరస్పాండెంట్ దీకొండ విజయ కుమారి , ఉపాధ్యాయులు సుజాత , విద్యాసాగర్ , రేష్మ , విష్ణు , లీల, రాజకుమార్ , ఉదయ , శ్రీ హర్ష ,మహేందర్ , విద్యార్థులు ఉన్నారు .
No comments:
Post a Comment