Thursday, 7 September 2017

పార్టీలకతీతంగా రైతు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలి 

పార్టీలకతీతంగా రైతు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలి 


 కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  సెప్టెంబర్ 07 ;     పార్టీలకతీతంగా రైతు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని రెబ్బెన మండల తుంగేదా గ్రామ రైతులు గురువారం రెబ్బెన ఉప  తహసీల్దార్  విష్ణు కు  వినతిపత్రం అందచేసి అనంతరం మాట్లాడుతూ . గ్రామకమిటీ లనియమాకం కేవలం టి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులకు మాత్రమే అన్నట్లుగా తమపార్టీ వారినే ఎన్నుకున్నారని, ఇది రాజ్యాంగస్ఫూర్తికి పూర్తిగా వ్యతిరేకమని, ముందుగా గ్రామసభ నిర్వహించి పార్టీలకతీతంగా సభ్యులను ఎన్నుకొని  కమిటీ  నియామకం చేయాలనీ రైతులు కోరారు. ఇలా చేయని పక్షంలో ఆందోళన బాట పడతామనితెలిపారు. ఈ కార్యక్రమంలో తుంగేదా గ్రామరైతులు పూదరి హరీష్,పూదరి శ్రీకాంత్,రాచకొండ రాజు, భామిని శ్రీనివాస్,డోంగ్రి మహీధర్,తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment