భూ సర్వే ను పక్కాగా నిర్వహించాలి ; జిల్లా కలెక్టర్ చంపాలాల్
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 19 ; భూ సర్వే ను పక్కాగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ చంపాలాల్ అన్నారు. సర్వే లో భాగంగా మంగళవారం రెబ్బెన మండలం జక్కులపల్లి గ్రామంలో జరుగుతున్న భూ సర్వే ను జిల్లా కలెక్టర్ చంపాలాల్ పరిశీలించారు. రైతులను భూ సర్వే పై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేసారు. సర్వే ను తెలంగాణ ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో చేపట్టిందని దానిని ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తిచేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్ గౌడ్, ఉప తహసీల్దార్ విష్ణు ,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment