బాల్ బాడ్మింటన్ సబ్ జూనియర్ జట్ల ఎంపిక
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 16 ; ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అండర్ 15 సబ్ జూనియర్స్ బాల్ బాడ్మింటన్ బాలుర మరియు బాలికల సెలెక్షన్స్ శనివారం నాడు రెబ్బెన మండలం గోలేటి సింగరేణి పాఠశాలలో జరిగాయి . ఇందులో ఎంపికైనజట్లు 25,26,27 తేదీలలోఖమ్మంలోని కల్లూరులో జరిగే అంతర జిల్లా బాల్ బాడ్మింటన్ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. . ఈ సందర్భంగాడ్ జి ఎం పర్సనల్ కిరణ్ క్రీడాకారులతో మాట్లాడుతూ మనజిల్లాలోని క్రీడాకారులుఅంతర జిల్లా పోటీలలో పతకాలు సాధించాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో బాల్ బాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా కోశాధికారి మహేందర్ రెడ్డి ,పి ఈ టి లు రమేష్,భాస్కర్,రాజ్ మహమ్మద్, అనిల్, ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment