మొక్కలు నాటండి పర్యావరణాన్నిరక్షించండి ; తహసీల్దార్ రమేష్ గౌడ్
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన సెప్టెంబర్ 11 ; రెబ్బెన మండలంలోనిప్రతిఒక్కరు కనీసం ఒక మొక్కనైనా నాటి ప్రక్రుతి ప్రేమికులుగా మారాలని తహసీల్దార్ రమేష్ గౌడ్ అన్నారు. సోమవారం కార్యాలయంలో మామిడిమొక్కలను నాటి వాటి సంరక్షణ భాద్యతను సిబ్బంది చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. ఎప్పుడో నిజాం కాలంలో నాటిన మొక్కల నీడన ఈ రోజు తన కార్యాలయం ఉందని ,నిత్యం తన ఆఫీసుకు వచ్చే సందర్శకులు వాటి కింద సేదతీరుతుండడం చూశానని, అలాగే ఈ రోజు పాతిన చిరు మొక్కలే రేపటితరానికి మహావృక్షలై నీడనిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్ వసంత్, స్థానిక టి ఆర్ ఎస్ నాయకులు రాజాగౌడ్, సుదర్శన్ గౌడ్, అజమేరా రమేష్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment