సింగరేణి గుర్తింపు ఎన్నికలలో ఏ ఐ టి యూ సీ ని గెలిపించండి ; ఏ ఇ టి యూ సీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 21 : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలలో కార్మికులు ఏ ఐ టి యూ సీ ని గెలిపించాలని ఏ ఇ టి యూ సీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ అన్నారు. గురువారం రెబ్బెన గోలెట్ కే ఎల్ మహీంద్రా భవనంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టిబి జి కే ఎస్ నాయకులు ఎన్నికలలో ఇచిన హామీలను నెరవేర్చకుండా కార్మికులను మభ్య పెడుతున్నారని, కార్మికుల పక్షాన ఎప్పటికి నిలబడి పోరాటాలు చేసేది తమ యూనియన్ మాత్రమేనని అన్నారు.ముఖ్యమంత్రి ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను తుంగలో తొక్కి కార్మికులను మోసంచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అంబాలా గుడెల్ , జిల్లా అధ్యక్షులు ఎస్. తిరుపతి, కార్యదర్శి బోగే ఉపేందర్, ఉప కార్యదర్శి రాయల నర్సయ్య రాజేష్,, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment