Wednesday, 27 September 2017

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలలో బాణం గుర్తుకు వోటు వేసి గెలిపించాలి ; ఎం ఎల్ సీ పురాణం సతీష్

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలలో బాణం గుర్తుకు వోటు వేసి గెలిపించాలి ;ఎం ఎల్ సీ  పురాణం సతీష్  

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 27 : సింగరేణి లో వారసత్వ ఉద్యోగాలు రాకపోవడానికి  అన్ని  జాతీయ సంఘాలే కారణమని  అని ఎం ఎల్ సీ  పురాణం సతీష్ ,  ఎం ఎల్ ఏ  లు  దుర్గం చిన్నయ్య, కోవలక్ష్మిలు  అన్నారు.  గుర్తింపు సంఘం ఎన్నికలలో బాణం గుర్తుకు వోటు వేసి గెలిపించాలని , వారసత్వ ఉద్యోగాలు పునరుద్దరించే సత్తా ఒక్క సీఎం కెసిఆర్ కె ఉందన్నారు . అవసరమైతే చట్ట సవరణకు కూడా సీఎం వెనకాడరని అన్నారు.  ఉమ్మడి రాష్టం లో సింగరేణి వారసత్వ ఉద్యోగాలు చట్టబద్ధమైన హక్కులను పోగొట్టిందే ఏఐటీయూసీ నాయకులని విమర్శించారు, సింగరేణి వ్యాప్తంగా ఉన్న కార్మికులందరికీ  ఈ విషయం తెలుసు అన్నారు.  సీఎం కెసిఆర్  సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తానని ప్రకటన చేసిన వెంటనే ఏఐటీయూసీ నాయకులూ దొంగ చాటున వెళ్లి కోర్ట్ లో కేసు వేసి వారసత్వ ఉద్యోగాలు రాకుండా అడ్డుకుందాని ఆరోపించారు. ఆనాడు గుర్తింపు  సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ గెలిచి కార్మికులకు చేసిందేమి లేదని విమర్శించారు.   టిబిజికెఎస్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచాక ఎంపీ కవిత ఆధ్వర్యం లో కార్మికులకు అనేక హక్కులు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేలా కృషి చేశామని గుర్తు చేసారు ఈ కార్యక్రమం లో  టిబిజికెఎస్ ఉపాధ్యక్షులు సదాశివ్, నాయకులూ శ్రీనివాస్, రాంబాబు, ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment