Friday, 22 September 2017

సింగరేణి సేవాసంస్థ ఆధ్వర్యంలో వృత్తి శిక్షణ తరగతులు

సింగరేణి సేవాసంస్థ ఆధ్వర్యంలో వృత్తి శిక్షణ తరగతులు 

  
 
   కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 22 :    సింగరేణి సేవాసంస్థ ఆధ్వర్యంలో కార్మికుల కుటుంబ సభ్యులకు వృత్తిపరమైన శిక్షణ తరగతుల ఏర్పాటులో భాగంగ  శుక్రవారంనాడు బెల్లంపల్లి ఏరియా గోలేటిలో స్పోకెన్ ఇంగ్లీష్, బ్యూటిషన్ ,కుట్టు శిక్షణ తరగతులను గెనేరం మేనేజర్ రవిశంకర్, సేవాసమితి అధ్యక్షురాలు అనురాధ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీమతి అనురాధ మాట్లాడుతూ  ప్రతి సంవత్సరంలాగానే ఈ ఏడూ కూడా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని దీనిని సద్వినియోగం చేసుకొని నైపుణ్యాన్ని పెంచుకొని స్వయంఉపాధి పొందవచ్చని అన్నారు. సింగరేణి సంస్థ సేవాసంస్థకు తగు నిధులు కేటాయిస్తుందని రాబోయే కాలంలో యువకులకు మోటార్  డ్రైవింగ్, శిక్షణ తరగతులు నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సభ్యురాళ్లు  సొల్లు లక్ష్మి, శంకరమ్మ, తిరుమల, విజయలక్ష్మి, వెంకటమ్మ, ఝాన్సీ, రాణి, మరియు అధికారులు  తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment