Wednesday, 20 September 2017

నిండుగర్భిణీని పట్టించుకోని ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది

నిండుగర్భిణీని పట్టించుకోని ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది 




      కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 20;   పురిటి నోనొప్పులతో దేవులగుడకి చెందిన  బానోతు  గంగా అనే మహిళ  రెబ్బన ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం కి రాగ హాస్పత్రికి తాళాలు  వేసి ఉండడం వలన 4నుండి 6 గంటల వరకు పి హెచ్ సి ముందు పురిటి నొప్పులతో బాధపడుతుండగా స్థానికులు గమనించి పి  హెచ్ సి   సిబ్బందికి  సమాచారం అందించగా వార్డు బాయ్ వచ్చి హాస్పిటల్  తాళాలు తెరిచి పేషెంట్ను లోనికి తీసుకెళ్లారు.  4 గంటల నుండి 6 గంటల వరకు 108 కి  ఫోన్ చెయ్యగా 108  సిబ్బంది కూడా స్పందించలేదు.    నిండు గర్భిణీ పురిటి నొప్పులతో  రెబ్బన ప్రభుత్వ హాసుపత్రి ముందు  రెండు గంటలపాటు ప్రసవ వేదన అనుభవిస్తూ  వేచిఉన్న స్పందించని వైద్యసిబ్బంది, అంబులెన్సుకి సమాచారం అందించిన స్పందన లేకపోవడంతో,  రెండు గంటలపాటు మహిళా ఇబ్బంది చూడలేక స్థానికులు పత్రిక వాళ్ళకి సమాచారం ఇవ్వగా అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే  ఇది నా  డ్యూటీ కాదని నాకు సంబంధం లేదు అన్నట్టు ప్రవర్తించగా వారు తోచని పరిస్థితుల్లో ఉండగా  6. 30కి  నర్సు వచ్చి చూడడం జరిగింది ఇటువంటి   పరిస్థితి పునరావృతం కాకుండా  చూడాలని స్థానికులు కోరుతున్నారు కావున  దీని ఫై సంబంధిత అధికారులు తగు చేర్య తీసుకోవని కోరుతున్నారు.

No comments:

Post a Comment