ఏఐటీయూసీలో చేరిన డోర్లి కార్మికులు
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 13 ; సింగరేణిలో 6వ దఫా గుర్తింపు సంఘం ఎన్నికలు అక్టోబర్ 5వ తేదీన జరుగుతున్న సందర్బంగా సింగరేణి వ్యాప్తంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 11 ఏరియాల్లో ప్రచారాన్ని పతాక స్థాయిలో చేపడుతున్నామని, అన్ని కార్మిక సంఘాల కంటే ముందున్నామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి డి.శేషయ్య అన్నారు. బుధవారం బెల్లంపల్లి ఏరియా డోర్లి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ లో నిర్వహించిన ద్వారా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఏరియాలో టీబీజీకేఎస్ నుండి ఏఐటీయూసీలోకి వలసలు ఊపందుకొని తెబొగకాసం దుకాణం ఖాళీ అవుతుందని అన్నారు. 50 టీబీజేకెస్ కార్యకర్తలు ఏఐటీయూసీ కండువాలు కప్పి యూనియన్ లోకి డి శేషయ్య ఆహ్వానించారు దీనితో టీబీజేకెస్ ఉనికి ప్రమాదం లో పడిందని అయన అన్నారు బెల్లంపల్లి ఏరియా గెలుపుతో పటు సింగరేణి వ్యాప్తంగా ఒక ఉప్పెన గ టీబీజేకెస్ మరియు ఇతర సంగాల నుండి పెద్ద ఎత్తున ఏఐటీయూసీ లకు చేరుతున్నానని పేర్కొన్నారు సింగరేణి ఆర్జించిన లాభాలనుండి విచ్చలవిడిగా ప్రభుత్వ పనులకు ధారి మరలిస్తున్నారని ఇట్టి దుర్వినియోగాన్ని నిర్వహించే అందుకు పోరాటాలు చేస్తామని అన్నారు ఈ సమావేశం లో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్ తిరుపతి ,ఉపాధ్యక్షులు బయ్యా మొగలి ,ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబ్బల ఓదెలు,నాయకులూ చారి ,బి జగ్గయ్య,శేషు,సారయ్య,రాజన్న,నాగరాజు,రాయల నర్సయ్య ,దివాకర్,సతీష్,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment