Monday, 25 September 2017

జిల్లా హోం గార్డ్ ల సేవలు ప్రశంసనియమైనవి - జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్

జిల్లా హోం గార్డ్ ల సేవలు ప్రశంసనియమైనవి  - జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ 


  కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 25 :   జిల్లా లోని హోం గార్డ్స్  సేవలు ప్రశంసనియమైనవి మరియు వెలకట్టలేనివి అని జిల్లా ఎస్పి తెలిపారు. హోం గార్డ్స్ జిల్లా లో అత్యవసర సమయాలలో కూడా అందుబాటులో వుండి కానిస్టేబుల్ ల తో సమానంగా  సేవలు అందిస్తున్నారని జిల్లా ఎస్పి తెలిపారు , అందుకే వారికి ఆర్థిక స్వావలంబన అందించేందుకే జిల్లా లో  “చేయూత” అనే కార్యక్రమం ను చేపట్టామని దిని ద్వార వారికి ఆర్థిక భరోసా కలిపిస్తూ, వారిలోని ఆత్మనూన్యత బావం తొలగించి  విధుల పట్ల విశ్వాసం పెంపోదిస్తున్నామని జిల్లా ఎస్పి తెలిపారు, చేయూత కార్యక్రమం లో బాగముగా ఆదివారం స్థానిక  ఎస్పి క్యాంపు కార్యాలయము లో ప్రమాద వశాత్తు మరణించిన హోం గార్డ్ తుమ్రం బికాజి కుటుంబమునకు జిల్లా ఎస్పి  చేతుల మీదుగా 5,00,000 /- లక్షల రూపాయల చెక్కు ను బార్య తుమ్రం శోభ కు అందచేశారు, అనంతరం మరణించిన తుమ్రం బికాజి బార్య శోభ తో జిల్లా ఎస్పి మాట్లాడుతూ  పిల్లల యొక్క భవిష్యత్తు కోసం జిల్లా పోలీసుల సహకారం ఎల్లప్పుడు ఉంటుందని, పిల్లలను బాగా చదివించి మంచి భవిష్యత్తు వారికి కలిపించే బాద్యత తమ పైన కూడా వున్నదని మరణించిన బికాజి కుటుంబానికి  భరోసా కలిపించారు.అనంతరం  జిల్లా ఎస్పి చేయూత కార్యక్రమం కింద 150 మంది హోం గార్డ్ లకు  యూనిఫాం, బెల్ట్  ,క్యాప్, షూ  మరియు జెర్సి లను అందించి పోలీసు యొక్క ప్రతిష్ట పెంచేలా విధులు నిర్వర్తించాలని ప్రోత్సహించారు, అనంతరం హోం గార్డ్ లతో జిల్లా ఎస్పి మాట్లాడుతూ జిల్లా లో హోం గార్డ్ సంక్షేమమున కే  చేయూత అను కార్యక్రమము చేపట్టామని ఈ కార్యక్రమము కింద హోం గార్డ్ లందరికి లబ్ది చేకురనుందని , విధి నిర్వహణలో ప్రమాద వశాత్తు మరణించిన లేదా గాయపడిన హోం గార్డ్లకు సాంత్వన చేకురేలా చర్యలు తీసుకుంటామని, అత్యవసర వైద్య సహాయం అవసరం అయిన హోం గార్డ్ కుటుంబాలకు వాహన సదుపాయం కూడా కలిపిస్తామని, ఆపదసమయం లో అదుకునేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ముందువుంటుందని జిల్లా ఎస్పి హామీ ఇచ్చారు, ఈ నూతన ఉత్తేజం ఉపయోగించుకొని  ఆత్మ స్థైర్యం తో ఇలాగె విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమము లో ఎస్పి సిసి దుర్గం శ్రీనివాస్ , ఎస్బి సిఐ సుధాకర్ , ఎస్బి ఎస్సై లు శివకుమార్ , శ్యాం సుందర్, హోం గార్డ్ ఆర్.ఐ అనిల్ కుమార్, హోం గార్డ్ కార్యాలయ రైటర్ లు అవినాష్ , వాజిద్ ఆహ్మెద్ ఖాన్, హోం గార్డ్స్ దీపక్ , వినేష్ , జ్ఞానేశ్వర్ , గంగాధర్ , శంకర్, లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment