తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 07 ; తెలంగాణ విమోచనాదినాన్ని సెప్టెంబర్ పదిహేడున అధికారికంగా రాష్ట్రప్రభుత్వం నిర్వహించాలని బీజేపీ ఆసిఫాబాద్ మండల అధ్యక్షులు విశాల్ ఖాంద్రే ఆసిఫాబాదు తహసీల్దార్ కు గురువారం వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా విశాల్ ఖాంద్రే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఇదే కెసిఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికార కార్యక్రమంగా నిర్వహించాలని అప్పటి ప్రభుత్వాలను డిమాండ్ చేసారు. కానీ ,తెలంగాణరాష్ట్రం ఏర్పడ్డాక తానే ముఖ్యమంత్రి అయ్యి కేవలం ఎం ఐ ఎం పార్టీమెప్పుకోసం ఆ పార్టీచేసే ఒత్తిడికి తలొగ్గి సెప్టెంబరుపదిహేడున జరపవలసిన తెలంగాణ విమోచనదినోత్సవాన్ని అధికారిక కార్యక్రమంగా నిర్వహించడం లేదు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు పెద్దపీట వేసి ఎందరో విద్యార్థులు,ప్రజలు, నాయకుల త్యాగఫలమైన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కారణమైన వారిని స్మరించుకోవడానికి విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని, లేనిపక్షంలో బీజేపీ ఆందోళనబాట పట్టాల్సివస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోఆసిఫాబాద్ ,జిల్లా ప్రధానకార్యదర్శి కేసరి ఆంజనేయులుగౌడ్, బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీమతి ఆంప్టే ,,నాయకులూ సాయికృష్ణ, జాదవ్, అఖిల్, నవీన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment