Thursday, 7 September 2017

సింగరేణిలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతాం                                ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి 

సింగరేణిలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతాం 
                              ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి 



 కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  సెప్టెంబర్ 07 ;  సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిలో ఉపరితల గనులను   ప్రైవేటీకరణ  చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఏఐటీయూసీ  గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి ఆరోపించారు.గురువారం బెల్లంపల్లి ఏరియాలోని కైరగూర ఓపెన్ కాస్ట్ లోని వర్క్ షాప్ కార్మికులను ఉద్ధ్యేశించి తిరుపతి మాట్లాడుతు తాడిచర్ల గనిని ప్రైవేటీకరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వా  మెప్పు కోసం సింగరేణి సంస్థ సిఎస్ఆర్ నిధులను సింగరేణికి సంబంధం లేని ప్రాంతాలైన గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్ల, నిజామాబాద్, హైదరాబాద్ లలో ఖర్చు పెడుతు  సింగరేణి కార్మికులకు తీవ్రని అన్యాయం చేస్తుందని అన్నారు.  కార్మిక వర్గం ఏఐటీయూసీని ఆదరించి నక్షత్రం (చుక్క) గుర్తుకు ఓటు వేసి బారీ  మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు చేసారు .ఏఐటీయూసీ గుర్తింపు   సంఘంగా గెలవగానే వారసత్వ ఉద్యోగ హాక్కును సాధిస్తామని, కార్మికుల స్వంతింటి కళను  నెరవేరుస్తామని అన్నారు. కార్మిక వర్గాన్ని మోసం చేసిన టీబీజీకేఎస్ ను చిత్తు చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పాలని అయన అన్నారు.ఈ సమావేశంలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నాయకులు ముచ్చర్ల మల్లయ్య,పేరం శ్రీనివాస్, ఏఐటీయూసీ బ్రాంచి ఉపాధ్యక్షులు బయ్యా మొగిలి,ఫిట్ కార్యదర్శి జూపాక రాజేష్, సహాయ ఫిట్ కార్యదర్శి దివాకర్,ఆర్గనైజింగ్ర్శు కార్యదలు సోకాల శ్రీనివాస్, ఎం.లక్ష్మీనారాయణ, నాయకులు కిరణ్ బాబు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment