సింగరేణి సేవ సమితి ఆధ్వర్యంలో పండ్ల మొక్కల పంపిణి
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 14 ; తెలంగాణకు హరితహారంలో భాగంగా సింగరేణి సంస్థ మరియు సింగరేణి సేవ సమితి ఆధ్వర్యంలో 8 రకాల పండ్ల మొక్కలు ఐనా మామిడి, కొబ్బరి, సపోటా, దానిమ్మ, బత్తాయి, నిమ్మ, పనస, జామ మొక్కలను పంపిణి చేసారు. గురువారం బెల్లంపల్లి ఏరియా గోలేటి టౌన్ షిప్ లోని ప్రధాన కూడలిల్లో జనరల్ మేనేజర్ కే.రవిశంకర్, సేవ సమితి అధ్యక్షురాలు కే.అనురాధ రవిశంకర్ లు పంపిణి చేసారు. ఈ సందర్బంగా జీఎం రవిశంకర్ మాట్లాడుతూ ఈ సంవత్సరానికి 25000 పండ్ల మొక్కలకు గాను 15000 మొక్కలను సింగరేణి ఆధ్వర్యంలో పంపిణి చేస్తుండగా మరో 10000 మొక్కలను ఆసిఫాబాద్ అటవీ శాఖ ఆధ్వర్యంలో పంపిణి చేయడం జరుగుతుందని అన్నారు. పండ్ల మొక్కలను ఇంటి వద్దనే పెంచి పోషిస్తే మంచి పండ్లను పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వో టూ జీఎం కొండయ్య, సింగరేణి అధికారులు జె.కిరణ్, సుదర్శన్, రాజేశ్వర్ రావు, పర్యవరణ అధికారి కృష్ణమాచార్య, ఐ.తిరుపతి, కె.దేవేందర్, సమ్మయ్య, హెచ్.రమేష్, కుమార సామీలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment