రైతు సమన్వయ కమిటీల ఏర్పాటులోరాజకీయ దురుద్దేశాలు
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన సెప్టెంబర్ 05 : ప్రభుత్వం కొత్తగాతలపెట్టిన గ్రామా రైతు సమన్వయ కమిటీల నియమాకంలో రాజకీయ దురుద్దేశాలున్నాయని రెబ్బెన మండల ఎం పి టి సి కోవూరు శ్రీనివాస్ ,గంగపుర్ సర్పంచ్ ముంజం రవీందర్ ,కాంగ్రెసుపార్టీ మజి ఉపాధ్యక్షులు అజ్మిరా బలరాం నాయక్ లు అన్నారు. రెబ్బెన మండలం గోలేటి లో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడుతూ గ్రామకమిటీల నియామకం పార్టీలకు ఆతీతంగా జరగాల్సి ఉండగా కేవలం టి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులనే పిలిచి రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ పునరావాసం కోసం చేస్తున్న ప్రక్రియగా నిర్వహిస్తున్నారని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు,గిరిజనులకు హక్కుపత్రాలు,రైతులకు ఒకేదఫా రుణమాఫీ వంటి పథకాలలో ఎంతో పారదర్శకత పాటించిందని గుర్తుచేశారు. టి ఆర్ ఎస్ పార్టీ శ్రేణీలలో వస్తున్నా అసమ్మతిని చల్లార్చడానికి ఈ ప్రక్రియ చేపట్టారని విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటె గ్రామసభలు ఏర్పాటుచేసి పార్టీలకు అతీతంగా సమన్వయ సంఘాలను ఏర్పాటుచేయాలని అన్నారు. ఈ సమావేశంలో భిక్ఖు నాయక్, దుప్ప నాయక్, భీం పటేల్ ,గాజుల రవీందర్, వెంకటేశం. అనిసెట్టి వెంకన్న, సంగం బానయ్య, మధుకరగౌడ్, సంతొహ్, లష్మినారాయణగౌడ్, లక్సమయ్య తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment