బతుకమ్మ పండుగకు నాసిరకం చీరలు ; బి జె పి జిల్లా మహిళా మోర్చ అధ్యక్షురాలు శ్రీమతి ఆంప్ట్
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 20 : బతుకమ్మ పేరుతో నాశిరకం చీరలు పంపిణి చేస్తూ ప్రజా దనాన్నీ వృధా చేస్తున్నారని బి జె పి మహిళా మోర్చ అధ్యక్షులు శ్రీమతి ఆంప్ట్ అన్నారు. బుధవారం కుమ్మరం భీం ఆసిబాద్ జిల్లా కేద్రంలో ఏర్పాటు చేసిన సమావేశం లో ఆమె మాట్లాడారు . తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగకు నాసిరకం చీరలు పంచుతూ తెలంగాణ ఆడబిడ్డల గౌరవాన్నీ కించపరిచే విధంగాప్రవర్తించిందని అన్నారు. ఇతర మాటలవారికి ఆధార్ కార్డు లింక్ పెట్టకుండా పంపిణి చేసి కేవలం బతుకమ్మ పండుగకు మాత్రం గుర్తింపు కార్డు కావలనడం సరికాదన్నారు. ఈ తతంగమంతా కేవలం టి ఆర్ ఎస్ పార్టీ వోట్ బ్యాంకు రాజకీయమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలకుంట శిరీష, బాంననేల ,గంగూబాయి, డోంగ్రే కవిత, సునీతా తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment