కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 23 ; రెబ్బెన : జర్నలిస్టుల సమస్యల పరిష్కరానికై టియుడబ్ల్యూజె(ఐజెయు) ముందుంటుందని కొమురంభీం జిల్లా ప్రధాన కార్యదర్శి సామిల్ల సంపత్ కుమార్ అన్నారు. బుధవారం రెబ్బెన లోని అతిధి గృహ ఆవరణలో జర్నలిస్టుల సమస్యల పరిష్కరానికై హైదరాబాద్ లో తలపెట్టిన జర్నలిస్టుల గర్జన పోస్టర్లు,కరపత్రాలు విడుదల చేసారు. అనంతరం మాట్లాడుతు ఈ నెల 28వ తేదీన తలపెట్టిన జర్నలిస్టుల గర్జనను విజయవంతం చేయాలని కోరారు. గత కొద్ది సంవత్సరాలుగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదన్నారు. ముఖ్యంగా జర్నలిస్టుల అక్రడేషన్ కార్డులతో పాటు,అర్హులైన జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని అలాగే అర్హులైన గ్రామీణ,మండల మరియు పట్టణ ప్రాంత జిల్లా కేంద్ర జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు, డబుల్ బెడ్ రూమ్ లను మంజూరు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ కె సునీల్ కుమార్, సంయుక్త కార్యదర్శి దొబ్బల శ్రీనివాస్, సభ్యులు డి సంజీవ్ కుమార్,ఇ పోచయ్య, కుమార్,వి వినయ్ కుమార్,ఎస్ దాసుబాబు,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment