కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (రెబ్బెన) మే 17 ; రైతుల కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టి రైతులను ఆపద్బాంధవుడి లాగా ఆదుకుంటున్నారని అన్నారు. డిఆర్ఓ కదం సురేష్ అన్నారు. రైతు బందు పథకంలో భాగంగా గురువారం రెబ్బెన మండలలంలోని ఎడవెల్లి, నారాయణపూర్ గ్రామంలో ముఖ్య అతిథిగా హాజరై చెక్కులు మరియు పట్టా పాసుపుస్తకాలు పంపిణి కార్యక్రమం నిర్వహించారు. .అనంతరం వారు మాట్లాడుతు రైతులు పండించే పంటలకు పెట్టుబడి సహాయం కొరకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు బందు పథకం ద్వారా లబ్దిపొందుతున్న రైతు కండ్లల్లో ఆనందం వెళ్లి విరుస్తుంది అన్నారు.
ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేపట్టని మహోన్నత కార్యక్రమాన్ని రైతుల కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టి రైతులను ఆపద్బాంధవుడి లాగా ఆదుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కర్నాధం సంజీవ్ కుమార్, జడ్పిటిసి అజ్మేర బాపూరావు వ్యవసాయ అధికారిని మంజుల, ఏఈఓ అర్చన, రెవెన్యూ సిబ్బంది ఉమ్లాల్, నాయకులూ పల్లె రాజేశ్వర్,భీమేష్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment