Thursday, 24 May 2018

కూరగాయల వ్యాపారి ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 24 ; (రెబ్బెన) ; రెబ్బెన మండల కేంద్రంలో స్థానికంగా  కూరగాయల వ్యాపారం నిర్వహించే సచిన్ జైస్వాల్ దంపతులు షిర్డీ సాయిబాబా భక్తులు కావడంతో మండల కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు గత కొన్నినెలలుగా ప్రతి గురువారం మధ్యాహ్నం   అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సచిన్ జైస్వాల్ దంపతులు మాట్లాడుతూ మండల కేంద్రానికి వచ్చే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ  కార్యక్రమాన్ని మొదలు పెట్టినట్లు   నిరంతరంగా ప్రతి గురువారం ఉంటుందని అన్నారు.

No comments:

Post a Comment