కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 18 ; తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలలు దగ్గరపడడడంతో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ సమావేశమందిరంలో ఎంపీడీఓ లతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామా పంచాయతీ వారీగా ఎస్ సి, ఎస్ టి, బి సి ల గణన వార్డుల వారీగా తయారు చేయాలని అన్నారు. పోలింగ్ స్టేషన్లను ప్రభుత్వ భవనలలోనే ఏర్పాటు చేయాలనీ , అందుబాటులో లేనప్పుడే ప్రైవేట్ భవనాలలో ఏర్పాటు చేయాలన్నారు.ఎన్నికలకు అవసరమయ్యే సిబ్బంది సంఖ్యా గురించి ముందుగానే సమాచారం ఇవ్వాలన్నారు. పోలింగ్ కేంద్రాల సమాచారం ముందుగానే ఇవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డి పి ఓ గంగాధర్, ఎంపీడీఓ లు అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment