Saturday, 19 May 2018

నిషేధిత పాలిథిన్ కవర్లు, గుట్కా, బెల్లం మరియు కలప నిల్వ పట్టివేత

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (రెబ్బెన) మే 19 ;  అక్రమ గుట్కా, బెల్లం మరియు కలప నిల్వలు రెబ్బెన లోఉన్నాయనే  ఖచ్చితమైన నిఘా  సమాచారం తో టాస్క్ ఫోర్స్  సి. ఐ  రాంబాబు నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ప్రసాద్, వెంకటేష్  లు గ్రామంలో తనిఖీ చేయగా సబ్ స్టేషన్ రోడ్డులోని సయ్యద్ అఫ్ఫు ఇంట్లో సుమారు 1000/- ల విలువగల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు,అనంతరం  ప్రగతి నగర్ లోని కొలిపాక కిరణ్ కుమార్ కిరాణా  దుకాణంలో  తనిఖీ నిర్వహించగా 3,500/- విలువ చేసే 85 కిలోల బెల్లం, 1,316/- విలువగల గుట్కా ప్యాకెట్లు, 1,680/- విలువగల నిషేధిత(0.8 మైక్రాన్ల కన్న ఎక్కువ ఉన్న) పాలిథిన్ కవర్లు మరియు 48,000/- విలువగల 20 ఫీట్ల టేకు కలప స్వాధీనం చేసుకొని వీటన్నింటిని తదుపరి విచారణ నిమిత్తం  రెబ్బెన పి.ఎస్. పోలీస్ వారికి  అప్పగించడం జరిగిందన్నారు.

No comments:

Post a Comment