Wednesday, 2 May 2018

క్రీడారంగానికి పెద్దపీట వేసింది తెరాస ప్రభుత్వమే :ఎమ్మెల్యే కోవా లక్ష్మి




కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 2 ; క్రీడారంగానికి పెద్దపీట వేసింది తెరాస ప్రభుత్వమే నని   జిల్లాలో క్రీడల అభివృద్ధి కొరకు క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి తెలిపారు. బుధవారం గోలేటి టౌన్ షిప్ సింగరేణి ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జిల్లా యువజన మరియు జిల్లా  క్రీడా శాఖ  ఆధ్వర్యంలో నిర్వహించ చేపట్టిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను  జెసి అశోక్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే కోవా లక్ష్మి ప్రారంభించారు. ముందుగా ఈ పాఠశాలకు స్కాట్ & గైడ్స్ విద్యార్థులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వసతులు సౌకర్యాలు గతంలో ఉండకపోవడంతో వేసవి  సెలవుల్లో యువత  వాగులు వంకలు వద్ద ఆటలు ఆడుకునే వారున్నారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు.అందరు జిల్లాను వెనుకబడిన జిల్లాగా పిలవడం సరికాదని అన్ని రంగాల్లో జిల్లా ముందంజలో నడుస్తుందన్నారు. విద్యా మరియు క్రీడల పరంగా జిల్లా విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని అన్నారు. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వపరంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు గత సంవత్సరం గోలేటిలో నిర్వహించిన జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలలో జిల్లాకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించిందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేందుకు కృషి చేయాలన్నారు. జిల్లాలో గర్ల్స్ స్పోర్ట్స్ స్కూల్ మంజూరు అయ్యే  విధంగా సిఎం దృష్టికి సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెలుతామన్నారు. క్రీడల్లో విద్యార్థులు యువత మరింత రాణించేందుకు ప్రస్తుతం ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.అనంతరం జెసి అశోక్ కుమార్ మాట్లాడుతు క్రీడలతో విద్యార్థుల్లో స్నేహ భావం, పోటీతత్వం అలవడుతుందన్నారు. గత కొంత కాలంగా జిల్లా కేంద్రం గోలేటి.కాగజ్ నగర్  ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న వసతులను క్రీడాకారులు సద్వినియోగం చేసుకుంటూ పోటీల్లో రాణించాలన్నారు.ఈ  సందర్భంగా క్రీడాకారులకు మెడల్స్ అందజేసి వారిని అభినందించారు. అనంతరం శిక్షణ శిబిరాలను జెండా ఉపి ప్రారంభించారు.ఈ  కార్యక్రమంలో డీవైపీఎం శ్రీనివాస్, డిజిఎం పర్సనల్ కిరణ్ డివైపిఎం రాజేశ్వర్,ఎంపీపీ సంజీవ్ కుమార్, ఎంఇఓ వెంకటేశ్వరస్వామి, ఒలింపిక్ ఆసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ నారాయణ రెడ్డి,  ఎంపిటీసి సురేంద్రరాజు, వనజ టఘవ్ ఫర్ జిల్లా కార్యదర్శి భాస్కర్ ,బాల్ బ్యాటమెంటన్ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ నారాయణ రెడ్డి , అసోసియేషన ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్, సంయుక్త  కార్యదర్శి తిరుపతి , జిల్లా ప్రధాన కార్యదర్శి మధుసూదన్ ,అచ్చం వెంకటేశ్వర్లతో ,పాటు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment