Saturday, 19 May 2018

ఓపెన్ కాస్ట్ గనులను సందర్శించిన సింగరేణి డైరెక్టర్

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (రెబ్బెన) మే 19 ; అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకొని ఓపెన్ కాస్ట్ గనుల ద్వారా నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేయాలనీ సింగరేణి డైరెక్టర్ భాస్కర్ రావు అన్నారు.  : బెల్లంపల్లి ఏరియా లోని  డోర్లి ఓసిపి-1, ఖైరుగూడ ఓసిపి, బిపిఎ -ఓసి -2 ఎక్స్టెంటు గనులను శెనివారం డైరెక్టర్ పిపి భాస్కర్ రావు మరియు ఎస్ సి ఎల్ అడ్వైజర్ మైనింగ్ డీఎన్ ప్రసాద్ లు బెల్లంపల్లి ఏరియా జియం రవి శెంకర్ తో కలిసి సందర్శించారు.ఈ సందర్బంగా వారు ఉత్పత్తి, మైనింగ్ ప్లాన్,రక్షణ,కోల్ లింకేజి మరియు నాణ్యత విషయాలపై ఏరియా అధికారులకు మార్గదర్శకాలు చేసారు.రాబోయే రోజుల్లో బెల్లంపల్లి ఏరియా గోలేటి ఓపెన్ కాస్ట్ మరియు చింతగూడ ఓపెన్ కాస్టుకు  సంబందించిన పనులను వేగవంతంగా చేపట్టాలని సూచించారు. అంతకుముందు జియం కార్యాలయంలో ఏరియా లోని అన్ని ప్రాజెక్టుల పి ఓల తో ప్లానులపై  చర్చించారు.ఓబీ మరియు కోల్ కాంట్రాక్టర్లకు సంబంధించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఓటు జియం ఎం శ్రీనివాస్,ప్రాజెక్టు ఆఫీసర్లు కె కొండయ్య,జి మోహన్ రెడ్డి, సి హెచ్ శ్రీనివాస్,ఏరియా ఇంజనీర్ రామారావు,కాలరీ మేనేజర్ లు ఎన్ ఉమాకాంత్,రమేష్,ఎల్ రమేష్ లు,సర్వే ఆఫీసర్ టి రామకృష్ణ రావు తదితరులు పాల్గొన్నారు.                         



No comments:

Post a Comment