Saturday, 12 May 2018

పంటలకు గిట్టు బాటు ధర చెల్లించి దళారి వ్యవస్థను నిర్మూలించాలి ; ఆత్రం సక్కు

 కాంగ్రెస్  ప్రజా చైత్యన బస్సు యాత్ర గోడప్రతుల విడుదల 
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 12 ;  సామాన్య రైతులకు గిట్టు బాటు ధర చెల్లించి దళారి వ్యవస్థను నిర్మూలించాలని ఆసిఫాబాద్ మాజీ ఎం ఎల్ ఏ,  టి పి  సి సి  రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆత్రం సక్కు అన్నారు.  ఈ నెల 13వ తేదీ నుండి ప్రాంభమయ్యే  మూడవ విడత  ప్రజా చైత్యన బస్సు యాత్ర గోడప్రతులను  శనివారం రెబ్బెన  ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఆవరణలో విడుదల చేశారు. ఈ సందర్బంగా  ఆత్రం సక్కు మాట్లాడుతు  తెరాస ప్రభుత్వం చేపట్టిన పథకాలు కేవలం వారి పార్టీ నాయకుల జేబులు నింపడానికే మిషిన్ భగీరథ, మిషిన్ కాకతీయ పనులు చేపట్టారు అని అన్నారు. భూ స్వాములకు మాత్రమే లబ్ది చెందేలా రైతు బందు పథకాన్ని ప్రవేశ పెట్టారు తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్ర ప్రజలకు చేసిన మేలు ఏమి లేదన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేరలేదన్నారు. సామాన్య రైతులకు గిట్టు బాటు ధర చెల్లించి దళారి వ్యవస్థను నిర్ములించాలన్నారు. పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని ఆశ చూపించి ఓట్లు దండుకొని ఇప్పటికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఉసెత్తడం లేదన్నారు. ఇంటికో ఉద్యోగం,దళితులకు మూడెకరాలు భూమి పంపిణి చేస్తామని కేవలం మాటలకే పరిమితమయ్యాయి అన్నారు. రానున్న ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఓటు బ్యాంక్ కోసం రైతులకు 4000,కొత్త పట్టా పాసుపుస్తకాలు పంపిణి కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఈ విషయాలన్నింటిని ప్రజలకు తెలియ పర్చడం కోసమే ప్రజా  చైతన్య బస్సు యాత్ర ముఖ్య ఉద్దేశం అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు  ముంజం రవిందర్, ఉపాధ్యక్షుడు దుర్గం రాజేష్, రెబ్బెన పిఏసిఎస్ ఛైర్మెన్ గాజుల రవిందర్,వెంకటేశం చారి,వెంకన్న,దుర్గం దేవాజి,పూదరి హరీష్ ,సంగేమ్ బానయ్య,లావుడ్య రమేష్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment