Wednesday, 2 May 2018

పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే తెరాస ప్రభుత్వ ద్యేయం

.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 2 ; రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తూ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపేట వేస్తుందని  ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్,ఎం ఎల్ ఏ  కోవలక్ష్మి లు   అన్నారు.బుధవారం రెబ్బెన మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో దీపం పథకం లబ్ధిదారులకు మంజూరైన గ్యాస్ కనెక్షన్లను  ఎమ్మెల్యే కోవలక్ష్మితో కలిసి లబ్దిదారులకు  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు. ముప్పై మూడు శాతం అడవులు ఉండాలనే లక్ష్యంతో ఇరవై రెండు శాతంగా ఉన్న అడవులను వృద్ధి చేసేందుకు ప్రభుత్వం హరితహారం పథకాన్ని ప్రవేశపెట్టి  చెట్లు పెంచే కార్యక్రమం చేపడుతుందన్నారు. మనమే పెట్టిన చెట్లను వంట చెరుకు కోసం నరికివేయకుండా నిరుపేద మహిళలందరికీ సబ్సిడీపై దీపం పథకంలోభాగంగాగ్యాస్కనెక్షన్లను అందజేస్తున్నామన్నారు.మహిళలందరూ గ్యాస్ కలెక్షన్లు సద్వినియోగం  చేసుకోవాలన్నారు కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ మహిళలకు వందశాతం సబ్సిడీ పై గ్యాస్ కనెక్షన్లు అందించడం అభినందనీయమన్నారు.ప్రజలకు మంచి చేస్తే అది ఏ పార్టీ అయినా దాన్ని మంచిగా ఒప్పుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలను కేంద్రప్రభుత్వంతో  సమాంతరంగా చేపడుతు ముందుకు సాగుతోందన్నారు. మండల కేంద్రాన్ని  వచ్చే ఎన్నికల నాటికి మట్టి రోడ్డు లేని గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు.  ఎన్నికల్లో ఇచ్చిన హామీల  మేరకు దాదాపు అన్ని వాడల్లో సిసి రోడ్లు ఏర్పాటు చేశామన్నారు.  భవిష్యత్తును  దృష్టిలో ఉంచుకుని ఏర్పడే కాలనీలకు సైతం రోడ్లు మంజూరు చేశామన్నారు.  ప్రజలకు సంక్షేమ పథకాలతోపాటు అభివృద్ధి సైతం అవసరమన్నారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ టిడిపి పార్టీలు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తున్న కూడా ఏమి చేయడం లేదని ప్రచారం చేస్తున్నాయన్నారు.    ప్రజలు బాధపడుతున్నారని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి  ఆరోపిస్తున్నారని ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలలో ప్రజలు బాధపడటం లేదన్నారు.  బాధపడుతున్నదంతా కాంగ్రెస్ పార్టీ దొంగలేనని ఘాటుగా విమర్శించారు.  మరో ఇరవై ఏళ్ల పాటు టీఆర్ ఎస్ పాలన  ఆదరించాలని.  కళ్యాణలక్ష్మీ పథకాన్ని రెండు లక్షలు, ఆసరాఫించన్లు  రెండు వేలు, ఒక లక్ష ఉన్న  రుణం మాఫీ  పథకాన్ని రెండు లక్షలకు పెంచేందుకు  ప్రభుత్వ పెద్దలు కృషి చేసే బాధ్యత తనపై వేసుకుంటానని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మెన్ గంధం శ్రీనివాస్,డీఎస్వో సత్య నారాయణ,ఎంపిపి సంజీవ్ కుమార్,వైస్ ఎంపిపి రేణుక,ఎంపిడివో సత్యనారాయణ సింగ్,రెబ్బెన సర్పంచ్ పేసరి వెంకటమ్మ,ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ కుందారపు శెంకరమ్మ,ఎంపిటిసి సభ్యులు సురేందర్ రాజు,పార్లపల్లి వనజ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment