Wednesday, 30 May 2018

కొలతల ప్రకారం ఉపాధి కూలీలకు సరైన వేతనం : డి ఆర్ డి ఓ వెంకట్

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 30; రెబ్బెన ; ఉపాధిహామీ కూలీలకు కేటాయించిన పని కొలతల ప్రకారం పూర్తిచేసినట్లైతే కొలతలకు  తగ్గట్టుగా సరైన  కూలి డబ్బులు చెల్లిస్తామని డి ఆర్ డి ఓ వెంకట్ అన్నారు. బుధవారం   రెబ్బెన మండలంలోని నారాయణపూర్, కిష్టాపూర్, నంబాల గ్రామపంచాయతీ పరిధిలలో జరుగుతున్న  ఉపాధిహామీ పనులను డి ఆర్ డి ఓ వెంకట్ పరిశీలించారు.  ఈ సందర్భంగా అయన కూలీల  హాజరు పట్టీలను, వారికి  ఏర్పాటు చేసిన వసతులను   పరిశీలించారు.వారికీ కేటాయించిన పనులను నాణ్యతతో కొలత ల ప్రకారం చేసినట్లయితే డబ్బులు ఎక్కువ వస్తాయని సూచించారు. ఎండవేడికి ఉపశమనంగా టెంట్లు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని అధికారులను  ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  వీరితోపాటు ఏ  పి  ఓ కల్పన, ఉపాధి  హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, తదితరులు  పాల్గొన్నారు.  

No comments:

Post a Comment