Monday, 14 May 2018

వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్నిఅధిగమించినందుకు మిఠాయిల పంపిణి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 14 ; రెబ్బెన మండలం గోలేటి క్రాస్  రోడ్ వద్ద గల సి ఎస్ పి  లో గోలేటి జీఎం  కార్మికులకు సోమవారం మిఠాయిల పంపిణి చేసారు. బెల్లంపల్లి సింగరేణి ఏరియా పరిధిలో  2017-18 కి గాను వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించినందుకు  గాను ఏరియాలోని  అన్ని గనులలో మరియు డిపార్టుమెంట్  లలో  కార్మికులకు మిఠాయిలు  పంపిణి చేసారు. ఈ సందర్భంగా జీఎం   రవిశంకర్ మాట్లాడుతూ కార్మికులు ఈ సంవత్సరంకూడా వార్షిక నిర్దేశిత ఉత్పత్తి  లక్ష్యాన్ని అధిగమించాలని  అన్నారు. కార్మికుల, ఉద్యోగుల సమిష్టి కృషితోనే ఇది సాధ్యమని అన్నారు. సింగరేణి సంస్థ కేవలం ఉత్పత్తి మాత్రమే కాకుండా కార్మికుల శ్రేయస్సు కోసం అనేక సంక్షేమ  కార్యక్రమాలు చేపడుతున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టూ  జీఎం  శ్రీనివాస్, డిజైన్ పర్సనల్ కిరణ్, టీజీబీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రావు, విశ్వనాధ్, సుదర్శనం తదితర అధికారులు, కార్మికులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment