Tuesday, 8 May 2018

ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 8 ; ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో కదం సురేష్ సంబంధితాధికారులకు ఆదేశించారు కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 14  వ తేదీ నుంచి 21  వరకూ నిర్వహించనున్నఇంటర్మీడియట్   పరీక్షలకు   ఏర్పాట్లను పూర్తిచేయాలన్నారు.  ప్రథమ సంవత్సరం పరీక్షలు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకూ ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం అయిదు ముప్పై వరకు ఉంటాయన్నారు ప్రథమ సంవత్సరానికి  సంబంధించి 1168 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 797 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు  నోడల్ అధికారి గోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో  డీఎస్పీ సత్యనారాయణ, పరీక్షల నిర్వహణాధికారి ఉదయబాబు, డిఎం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment