కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 29 ; రెబ్బెన మండలం లో ఉన్న అని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తమ పాఠశాలల బస్సులను,వేన్ లను పూర్తి ఫిట్ నెస్ తో ఉంచాలని రెబ్బెన ఎస్సై శివకుమార్ అన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కానుండడంతో విద్యార్థులను పాఠశాలలకు తీసుకువచ్చే బస్సు, వేన్ లను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వీటిని నడిపే డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి అని, డ్రైవర్ పేరును వాహనాలపై ప్రస్ఫుటంగా కనిపించేలా చేయాలనీ, వారి వివరాలను పోలీస్ స్టేషన్లో అందచేయాలని అన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో ప్రైవట్ స్కూల్ యజమానులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment