కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 4 ; గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వయంలో 2018- 2019 సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో 3,5,8వ తరగతులలో ప్రవేశానికి ఏ నెల 10వ తేదినుండి 25 వరకు గిరిజన బాల బాలికలు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లాపాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటీల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ముప్పై తేదీన ఉదయం పదకొండు గంటలకు జిల్లా కేంద్రంలోని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యక్రమంలో లాటరీ పద్ధతి ద్వారా ఎంపికచేయనున్నట్లు తెలిపారు విద్యార్థులు తెలుగు లేదా ఆంగ్ల మాధ్యమంను ఎంపిక చేసుకోవచ్చు అన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వారి వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ఏజెన్సీ గ్రామీణ ప్రాంతంలో1,50,000 రూపాయలు మరియు పట్టణ ప్రాంతాల్లో2,00,000 రూపాయలు మించరాదన్నారు జిల్లాలో తొంభై బెస్ట్ అవేలబుల్ సీట్లు మంజూరు కాగా ఇందులో పది పర్సంట్ పిటిజి తెగలకు, టెన్ పర్సెంట్ ఏజెన్సీ గ్రామాలకు చెందిన విద్యార్థులకు,మిగిలిన 80 పెర్చెంత్ సీట్లు అన్ని తెగలకు రిజర్వేషన్ ప్రాతిపదికపై కేటాయించినట్లు జిల్లా పాలనాధికారి తెలిపారు. దరఖాస్తు దారులు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి డీటీడీఓ కార్యాలయంలో నిర్ణిత గడువులోగా సమర్పించాలని కోరారు.
No comments:
Post a Comment