Sunday, 27 May 2018

రాజకీయ దురుద్దేశాలతో ఎం ఎల్ ఏ పై నిందలు మోపడం సరికాదు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  మే 27 ; రెబ్బెనతెరాస ప్రభుత్వం చేపట్టిన  అభివృద్ధి పనులను చిత్తశుద్ధితో అమలుచేసి, ప్రజలలో అభిమానాన్ని సంపాదించుకుంటున్నఎం ఎల్ ఏ   కోవలక్ష్మి పై రాజకీయ దురుద్దేశాలతో నిందలు మోపడం సరికాదని  కొమురంభీం జిల్లా తెరాస మహిళా ప్రధాన కార్యదర్శి కుందారపు శంకరమ్మ, రెబ్బెన సర్పంచ్ పెసర వెంకటమ్మలు అన్నారు.   ఆదివారం రెబ్బెనమండల కేంద్రం అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడరు. మాజీ ఎం ఎల్ ఏ  ఆత్రం సక్కు, డి సి సి ప్రధాన కార్యదర్శి విశ్వప్రసాదరావు చేసిన ఆరోపణలు అవాస్తవాలని అన్నారు. తెరాస ప్రభుత్వం చేపట్టిన  అభివృద్ధి పనులను  ఓర్వలేక అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రజాసేవకే అంకితమైన కుటుంబం నుంచి వచ్చిన  కోవలక్ష్మిగతంలో సర్పంచ్ గ రెండు సార్లు, ఎం పి  పి   గ ప్రజలకు సేవలందించారని అన్నారు.   ఎం ఎల్ ఏ  ఒక ఇల్లు కట్టుకొంటే తప్పాఅని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన టౌన్  అధ్యక్షురాలు ఎం  ,ప్రధాన కార్యదర్శి అన్నపూర్ణ అరుణ, కే లక్ష్మి, ఏ  పద్మ, ఇంకు బాయి , పోచమ్మ, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment